రేపు గ్రామపంచాయతీలో ఓటరు లిస్ట్ ప్రచురణ

తిరుమలగిరి 12 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలం లో 16 గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ ఓటరు నమూనా పత్రాలను రేపు ప్రతి గ్రామపంచాయతీ వద్ద నోటీస్ బోర్డులో తిరుమలగిరి మండలం 16 గ్రామాలకు సంబంధించిన వివరాలు ఇలా (1) బండ్లపల్లి 874 (2)చింతలకుంట తండ 290 (3) గుండెపూరి 1143 (4) జలాల్పురం 1326 (5) కన్నారెడ్డి కుంట తండ 600 (6) కోక్య నాయక్ తండ 652 (7) కొత్యా నాయక్ తండ 480 (8) మామిడాల 1211 (9) మర్రికుంట తండ 870 (10) మొండి చింత తండ 333 (11) రాఘవాపురం 544 (12) రాజ్ నాయక్ తండ 584 (13) సిద్ధి సముద్రం 428 (14) తాటిపాముల 2960 (15) తొండ 3237 (16) వెలిశాల 2115 ....వార్డుల వారిగా విభజించి ఓటర్ల వివరాలను ప్రచురించబడతాయని తిరుమలగిరి ఎంపీడీవో లాజర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు ఓటరు నమోనా పత్రాలలో పేర్లు సవరణ మరియు నూతన ఓటు హక్కు వినియోగించుకునే వారు ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు మీ సేవలో అప్లై చేసుకోగలరని తెలిపారు...