రీల్ హీరో ఎవరు ....రియల్ హీరో ఎవరు.... కామ్రేడ్ జె ఎస్ ఆర్
తెలంగాణ వార్త ప్రజా బంధువు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ...! 2 గంటల 30 నిమిషాల కల్పిత కధను టికెట్ కొని చూసి దానిలో వున్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి "హీరోలు" అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలనీ.... కార్మిక వర్గ బోరపుత్రుడు ...శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి.... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 9848540078 నేడు విద్యార్థి యువజనలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.... రియల్ హీరోలు ఎవరు. నకిలీ హీరోలు ఎవరు. జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో, జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో. రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో, భార్య బిడ్డలను వదిలి కొండ కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో, నిత్యం నేర్చుకుంటు పాఠాలు చెప్పే గురువు హీరో, ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో, ధర్మం, న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు. ఎటువంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం, సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు. నకిలీ, డూప్లికేట్, కల్పిత, తెర మీది హీరోల గురించి పరిశీలిద్దాం. తాత్కాలిక మేకప్ వేసుకొని, డమ్మీ గన్నులు, పిస్తోళ్ళు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు. వారు కేవలం జస్ట్ యాక్టర్స్ (నటులు) మాత్రమేననీ... కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ అన్నాడు. మాటలు వాళ్ళవి కావు , ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు, పాట వాళ్ళది కాదు, కధ వాళ్ళది కాదు, డైరెక్షన్ వాళ్ళది కాదు, సినిమా ఖర్చు (నిర్మాత ) వాళ్ళది కాదు. జస్ట్ 2 గంటల30నిముషాలు తెర మీద కనిపించి డబ్బులు తీసుకునే కొనే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రాల్లోని నటులు . కల్పిత, నట జీవితాలు కాబట్టే... వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది. అంతే కాదు..... క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా. డ్రగ్స్ కేసుల్లో, చీటింగ్ కేసుల్లో, తీవ్ర అనారోగ్య సమస్యల్లో అనేక మంది నటులు చిక్కుకుని సతమతం అవుతున్నారనీ బాధితుల బంధువు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ అన్నాడు వీళ్ళకోసమా. విద్యార్థులు, యువకులు గుడ్డలు చింపుకొనేది. వీళ్ళకోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసేది. వీళ్ళకోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది. వీళ్ళకోసమా ఫ్యాన్స్ పేరిట గొడవ పడి ప్రాణాలు తీసుకొనేది. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిస్తే నిజమైన హీరోలు అంటారు. సినిమా నటుల కోసం చస్తే జీరోలు అవుతాం. నిజాలు తెలుసుకోండి. మారండి. సినిమాలను సినిమాల్లాగానే చూడండి, మర్చిపోండి ఇది ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్.... 8328277285 మాట ప్రజా ప్రగతికి సద్ది మూట