హలో మాదిగ . ఛలో హైదరాబాద్ ఎమ్మార్పీఎస్ పిలుపు

Feb 2, 2025 - 20:19
Feb 3, 2025 - 18:43
 0  1
హలో మాదిగ  .  ఛలో హైదరాబాద్ ఎమ్మార్పీఎస్ పిలుపు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించబోయే "లక్షల డప్పులు - వేల గొంతులు" వాల్ పోస్టర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ ఆవిష్కరించి మాట్లాడుతూ.... ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 07 న హైదరాబాద్ లో జరుగు "లక్షల డప్పులు - వేల గొంతులు" మాదిగల భారీ సాంస్కృతిక మహా ప్రదర్శనకు ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రతి మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని SC రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయమని సబ్బండ వర్గాల ప్రజలు,ప్రజాస్వామిక వాదులు మద్దతు తెలుపుతున్నారని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై ప్రతి మాదిగ డప్పును భుజాన వేసుకొని సిద్ధపడి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోMRPS మండల ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ,MRPS అధికార ప్రతినిధి మిర్యాల చిన్ని మాదిగ MRPS ఉపాధ్యక్షులు పిడమర్తి ఉమేష్ మాదిగ,యడవెల్లి కార్తీక్ మాదిగ,పిడమర్తి వెంకటేష్ మాదిగ, పొట్టపెంజార రమేష్ మాదిగ, ముల్కలపల్లి కిరణ్ మాదిగ,బొల్లెపాక మహేష్ మాదిగ, ఇరుగు యాదయ్య మాదిగ, ఇరుగు మధు మాదిగ, కలకోట్ల నాగరాజు, పిడమర్తి అంజి మాదిగ , కలకోట్ల సతీష్ మాదిగ, ముల్కలపల్లి యల్లయ్య మాదిగ, బొడ్డు ఐలయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు