రాహుల్ గాంధీ అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్ .....మోడీదిష్టిబొమ్మ దగ్ధం

Jul 22, 2026 - 21:34
 0  2
రాహుల్ గాంధీ అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్ .....మోడీదిష్టిబొమ్మ దగ్ధం

తిరుమలగిరి 23 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  బీజేపీ అసమర్థ పాలనపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మరియు యువతపై లాఠీచార్జ్ నిరసిస్తూ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు   మందుల సామేలు ఆదేశానుసారం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు సుంకరి జనార్ధన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది  ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై, పేపర్ లీకులపై శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని, రాజ్యసభ సభ్యులను, ఎంపీలను, సీఎంలను, సీనియర్ నాయకులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ,కాషాయ కసాయి పాలకులు చేసిన లాఠీచార్జ్‌ను తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాo  భావి భారతాన్ని తీర్చిదిద్దే యువతపై లాఠీలు ప్రయోగించడం మోదీ ప్రభుత్వ అహంకారానికి, నియంతృత్వ ధోరణికి నిదర్శనం.    పేపర్ లీకులతో విసిగిపోయి, తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను శత్రువుల్లా చూస్తూ, బూటుకాళ్ల కింద తొక్కిపడేయడమేనా మీ ‘అచ్చే దిన్’?    విద్యార్థులపై పడ్డ ప్రతి లాఠీ దెబ్బకు, చిందిన ప్రతి రక్తపు బొట్టుకూ బిజెపి పార్టీ ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదు అని పేర్కొన్నారు 

ఈ కార్యక్రమంలో  తిరుమలగిరి మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   ఎల్సోజు నరేష్. తిరుమలగిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్.. వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిలాల్..   5వ వార్డ్ కౌన్సిలర్ తిరుమణి యాదగిరి.. 7వ వార్డు కౌన్సిలర్ బత్తుల శ్రీను..  9వ వార్డు కౌన్సిలర్ కన్యబోయిన మల్లయ్య.. 3వ వార్డ్ ఇంచార్జ్ కందుకూరి లక్ష్మయ్య.. 12వ వార్డు ఇంచార్జ్ పత్తేపురం సుధాకర్..   4వ వార్డ్ ఇంచార్జ్ ముద్ర బోయిన ఉప్పలయ్య..   మాజీ కౌన్సిలర్ గుగులోతు భాస్కర్.. తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ యాదవ్.. కోక్యానాయక్ తండ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు సుధాకర్..  వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్..సిద్ధిసముద్రం సర్పంచ్ ధరావత్ సుజాత రాజశేఖర్.. యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పేరాల నరేష్..తిరుమలగిరి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోల్ల వంశీ..  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  వంగాల డానియల్.. కిష్టు నాయకు  హీరు నాయక్.    దండుగుల యాదగిరి. మోహన్.కొమ్ము ప్రవీణ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొంపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి