రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమం

Feb 21, 2025 - 21:04
 0  15
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమం
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమం

స్థానిక సంస్థల్లో,నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటం

బడ్జెట్లో వికలాంగులకు నిధులు పెంచాలి

ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

రామన్నపేట 21 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఎన్.పి.ఆర్.డి 15వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణలో  రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం,స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటలు ఉదృతం చేస్తామని,ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసంఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. రామన్నపేట మండల కేంద్రంతో పాటు వెల్లంకి గ్రామంలో ఎన్ పి ఆర్ డి 15వ ఆవిర్భావ దినోత్సవంసందర్బంగా జెండా ఆవిష్కరణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జండా ఎగిరే చేశారు.ఈ సందర్బంగా ఎన్ పి ఆర్ డి  రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం ఉపేందర్  మాట్లాడుతూ* జాలి, దయ, కరుణ మాకొద్దు, మా హక్కులు మాకు కావాలి అంటూ దేశ వ్యాప్తంగా వికలాంగులను ఐక్యం చేయడానికి 2010ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఎల్ పి ఆర్ డి  కలకత్తా పట్టణంలోఏర్పడిందని,ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం వికలాంగులను సమీకరించి పోరాటాలు చేస్తుందని అన్నారు. పార్లమెంట్ వేదికగా వికలాంగుల సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేసిందని అన్నారు. 2016 RPD చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డ్స్,రైల్వేలో సౌకర్యాలు, సామూహిక ప్రాంతాలు అవరోధ రహితంగా మార్చడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ విలీననికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయాలు సాధించిందని అన్నారు.మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం సమరశిల పోరాటాలు చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతున్నాయని అన్నారు. పెన్షన్ పెంపుతో పాటు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు.బడ్జెట్లో నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బడ్జెట్ను సవరించి 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రయివేట్ పరిశ్రమలలో వికలాంగులకు 5శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండల గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేశం మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ మండల నాయకులు పున్న శ్రీధర్ నోముల రవివర్మ, శివ ఉదయ్ ,బీరప్ప మల్లమ్మ, కోనూరు వెంకటేశం,కే శీను నరసింహ వెల్లంకి గ్రామ నాయకులు తాటిపాముల జంగయ్య ఆవనగంటి  నాగేష్ గూని నరసింహ జెల్లా ఉపేందర్ జెల్లా  శ్రీరాములు మూడ నరసమ్మ  మూడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333