విద్యార్థులు బయట తిరుగుతున్నారని..హెడ్ మాస్టర్ ఏం చేశాడో చూడండి

జోగులాంబ గద్వాల 10 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: వసతి గృహంలో సక్రమంగా ఉండడం లేదని, చదువుకోమంటే బయట తిరుగుతున్నారని ఆరోపణల నెపంతో పది రోజులు ఇంటికి వెళ్లిపోవాలని విద్యార్థులను హెచ్చరించి పంపించిన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో చోటుచేసుకుంది. వార్డెన్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా రావద్దని హెచ్చరించడంతో.. చేసేది ఏమీ లేక విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే...మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రోజు మాదిరిగానే వసతి గృహంలో ఉంటూ ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాలి. కానీ నలుగురు విద్యార్థులు మాత్రం గత నెల 27వ తేదీన వసతి గృహం నుండి పాఠశాలకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని గమనించిన వసతి గృహం వార్డెన్ వారిని హెచ్చరించింది. బయట తిరుగుతుంటే చదువులు ఎలా కొనసాగుతాయని, వసతి గృహం నుండి నేరుగా పాఠశాలకు వెళ్లకుండా ఎలా బయట తిరుగుతారని నలుగురు రెడ్ హ్యాండుగా పట్టుకున్నారు. పది రోజుల వరకు వసతి గృహానికి రావద్దని, మీరు మారారని అనుకున్నప్పుడే వసతి గృహం వైపు రావాలని ,అంతవరకు రావద్దని ఇంటికి వెళ్ళిపోవాలని హెచ్చరించింది. విద్యార్థులు చేసేది ఏమీ లేక ఇంటి నుండి పాఠశాలకు వెళ్దామని అనుకున్నారు. అక్కడ కూడా ఉపాధ్యాయులు రావద్దని తెలపడంతో..13 రోజులపాటు ఇంటి వద్దే ఉన్నారు. సోమవారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు చేరుకుని పాఠశాల హెడ్ మాస్టర్ తో జరిగిన సంఘటనలను చెప్పుకొచ్చారు. 13 రోజులపాటు ఇంటి వద్దే ఉంటే విద్యార్థులు చదువులు పాడవుతాయని, ఎలా రావద్దని చెప్పారని తల్లిదండ్రులు, కొంతమంది గ్రామ నాయకులు హెడ్ మాస్టర్, వార్డెన్ తో వాదనకు దిగారు. ఇలాంటి శిక్ష ఎక్కడ కూడా ఉండదని, పిల్లలు తప్పులు చేయడం వాస్తవమేనని, పాఠశాలకు రావద్దని చెప్పడం ఇంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి విద్యార్థులు ఇలా చేయమని రాతపూర్వకంగా లెటర్ రాసి ఇచ్చే తప్ప తీసుకోమని వార్డెన్, పాఠశాల జిహెచ్ఎం చెప్పడంతో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు విద్యార్థులతో లెటర్ రాయించుకొని పాఠశాలకు రేపటి నుండి రావాలని తెలిపారు.