రాష్ట్ర ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు
-మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉగాది తెలుగు సంవత్సరారంభాన్ని సూచించే ముఖ్యమైన పండుగ అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన సమయమని తెలిపారు.
ఈ సందర్భంగా రైతాంగానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం సమృద్ధిగా పంటలు పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.