ప్రైవేటు స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలి.
జిల్లాలో కొన్ని స్కూళ్లు పర్మిషన్ లేకుండానే నడుపుతున్నారు వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఫీజుల నియంత్రణ చట్టంను అమలు చేయాలి
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు
పేద విద్యార్థులకు ప్రతి ప్రైవేటు స్కూల్లో 25% సీట్లు కచ్చితంగా కేటాయించాలి
* జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...
* జిల్లాలో ప్రవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల దోపిడిని తక్షణమే నియంత్రించాలి
* ప్రతి ప్రవేట్ స్కూల్లో కూడా ఫీజు స్ట్రక్చర్ని నోటీస్ బోర్డ్ లో పెట్టాలి.
* ఇంటర్నేషనల్ నేషనల్ స్థాయిలో పేర్లు పెట్టుకొని కేవలం రంగులు వేసి లక్షలలో వేళలో ఫీజులు వసూలు చేస్తున్నారు.
* మౌలిక సదుపాయాలు ఏమీ లేవు ఒక ఆటస్థలం లేదు టాయిలెట్స్ లేవు బాత్రూమ్స్ లేవు.
* ప్రైవేట్ స్కూళ్లను కొట్టాలలో, ఇండ్లలో, లాడ్జిల్లా టైపు లలో, హౌస్ బిల్డింగ్లలో, రేకుల కొట్టాలలో నడుపుకుంటూ వ్యాపారం చేస్తున్నది తప్ప నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి లేదు.
* అర్హత లేని వారికి తక్కువ జీతాలు ఇస్తూ విద్యను వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందించడం లేదని అన్నారు.
* అదేవిధంగా ఇప్పుడు స్కూలు ప్రారంభమైన సందర్భంగా బుక్కుల పేరుతో దుస్తుల పేరుతో టైం బెల్ట్ల పేరుతో, బస్సుల పేరుతో విచ్చలవిడిగా చెలరేగిపోతూ సామాన్యులను పీల్చుకా తింటున్నారు.
* ఐజ మండలంలో పర్మిషన్ లేని స్కూల్స్ : జీనియస్ గ్లోబల్ స్కూల్, సన్ సైని స్కూల్, వైష్ణవి స్కూల్, గాయత్రి స్కూల్, శ్రీ విద్యారణ్య విద్యాలయం స్కూల్, సహస్ర విద్యానికేతన్ స్కూల్ చిన్నతండ్రపాడు, మరియు న్యూ కాకతీయ స్కూల్ కు హై స్కూల్ పర్మిషన్ లేకున్నా కూడా రన్ చేస్తున్నారు.
* అదేవిధంగా ధరూర్ మండల కేంద్రంలోని అముక్త ఆస్పరెంట్ స్కూల్లో కి పర్మిషన్ లేదు అయినా రన్ చేస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి.
* పోయిన సంవత్సరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన కూడా చర్యలు తీసుకోలేదు.
* విచిత్రం ఏమిటంటే పోయిన సంవత్సరం ఐజ మండలంలోని సహస్ర విద్యానికేతన్య స్కూలు మరియు వైష్ణవి స్కూల్ లకు పరిమిషన్ లేదని మండల ఎంఈఓ సర్టిఫై చేసి వాటిని నడపకూడదని ఆదేశాలు జారీ చేస్తే కూడా వాటిని బేకతారు చేసి పోయిన సంవత్సరం మొత్తం స్కూల్ లను రన్ చేసినారు వాటిపైన చర్యలు శూన్యం.
* భవిష్యత్తులో ఫీజుల దోపిడిని అరికట్టకపోతే పెద్ద ఎత్తున బీర్ఎస్వి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండారి అభిషేక్, ఇమ్రాన్, సునీల్, గోవిందు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.