దారుణ హత్య గోనె సంచిలో మృతదేహం

May 23, 2026 - 11:41
 0  585
దారుణ హత్య  గోనె సంచిలో మృతదేహం

బిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య ... 

 దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు.. 

 గోనెసంచులో డెడ్ బాడీ... 

 20 ఏళ్ల నుండి రగులుతున్న పగలు.. 

భారీగా పోలీసుల మోహరింపు... 

నిందితుల కోసం గాలింపు.. 

సూర్యాపేట 23 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామంలో మరోసారి రాజకీయ కక్ష్యలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. రాత్రి 11:30 గంటల సమయంలో ఈ మర్డర్ జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు రాత్రి మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు డెడ్ బాడీని తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో యర్కారం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద గోనెసంచిలో కట్టి ఉంచిన డెడ్ బాడీని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ మర్డర్ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా ఆయన కుమారుడు జీవన్ చేసినట్లు గ్రామ ప్రజలతో పాటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో హత్య జరిగింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

 

 

తండ్రిని చంపినందుకు పగ తీర్చుకునేందుకే హత్యనా..!?

మృతి చెందిన చింతలపాటి మధు తండ్రి వీరయ్య గత 20 ఏళ్ల క్రితం 2007 సంవత్సరంలో అప్పటి మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్‌ను హత్య చేశారు. దీని ప్రతీకారంగానే వీరయ్య మీద కోపం ద్వేషం పెంచుకున్న రవీందర్ కుమారుడు జీవనే హత్య చేసి ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతుంది. పోలీసులు కూడా జీవన్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

 

యర్కారంలో 20 ఏళ్లలో 4 మర్డర్లు..

20 ఏళ్ల క్రితం రాజకీయ హత్యలు ఈ గ్రామంలో మొదలయ్యాయి. 20 ఏళ్ల క్రితం అప్పటి మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ ను చింతలపాటి వీరయ్య ప్రస్తుతం మర్డర్ గురైన మాజీ సర్పంచ్ మధు తండ్రి హత్య చేశాడు. 2020లో ఆరేళ్ల క్రితం కోపరేటివ్ ఎన్నికల సమయంలో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను హత్య చేశారు. ఆ తర్వాత 2024లో రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లయ్యను హత్య చేశారు. ప్రస్తుతం మధు హత్యతో 4 మర్డర్లు జరిగాయి.

 

 

ఏడేళ్ల నుంచి ఈ గ్రామంలో పికెటింగ్..

ఈ గ్రామంలో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను హత్య చేసినప్పుడు నుంచి ఈ గ్రామంలో పరిస్థితులను గమనించిన గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్పటినుండి ఈ గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. గ్రామ ప్రజలకు అవగాహన కలిగించేందుకు పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారికున్న పగలు ఆపే ప్రయత్నం చేసిన ఆగకుండా హత్యలు జరుగుతూనే ఉన్నాయి.

 

గ్రామంలో పోలీసుల మోహరింపు..

మధు హత్య జరిగిన విషయం గ్రామంలో తెలియడంతో భయాందోళన పరిస్థితి నెలకొంది. మధు హత్యకు గురైన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు గ్రామంలో మోహరించారు. ఎటువంటి సంఘటన జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి