నిరుద్యోగులను నమ్మించి.. నిలువునా ముంచుతున్న దగాకోరు కాంగ్రెస్
ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకుని నయవంచన చేసిన రేవంత్ సర్కార్
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
* అప్లికేషన్ ఫీజులను పెంచడం దుర్మార్గం.
* ఇదేనా ప్రజాపాలన అంటే..? నిరుద్యోగుల జేబులు కోత కోయడమేనా?
తక్షణమే పెంచిన అప్లికేషన్ ఫీజులను తగ్గించాలని డిమాండ్.
జోగులాంబ గద్వాల 12 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిరుద్యోగులతో కలిసి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ.... ఎన్నికలప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులూ ఉండవని నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చాక రూ. 200 ఉన్న టీజీపీఎస్‌సీ ఉద్యోగ అప్లికేషన్ ఫీజును ఏకంగా రూ. 1,000కి పెంచిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుందని అన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో కేవలం అప్లికేషన్ ఫీజులు 200 /- రూ. లు మాత్రమే ఉండేను.. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో అప్లికేషన్ ఫీజులు 400% అంటే 1000/- రూ. లకు పెంచడం ముమ్మాటికీ నిరుద్యోగులను నిండా ముంచడమే. ఇది నిరుద్యోగుల ద్రోహి ప్రభుత్వం.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం.. మూడు సంవత్సరాల్లో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు 16,978 మాత్రమే..
జాబ్ కాలెండర్ పేరుతో మోసం
నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి మోసం
విద్యార్థినిలకు స్కూటీలు మోసం
మెగా డీఎస్సీ మోసం.
నిరుద్యోగులతో గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం నేడు నిరుద్యోగులను నిండా ముంచుతుంది జాగ్రత్త నిరుద్యోగులారా... పెంచిన అప్లికేషన్ ఫీజులను తగ్గించే వరకు నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్వి నిరంతరం పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నిరుద్యోగులు నటరాజు, నరసింహ, ఇమ్రాన్, చక్రి, సునీల్, రాము, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.