అధికారికంగా ఏర్పడినసొసైటీల ఇసుక ర్యాంపుల నుండి మాత్రమే ఇసుక సరఫరా జరగాలి
ఇష్టానుసారంగా ఏర్పాటైన ఇసుక నిలువలపై కఠిన చర్యలుతీసుకోవా లని సంబంధిత అధికారులను ఆదేశించిన భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.
తెలంగాణ వార్త జూన్18 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అధికారికంగా సొసైటీ సభ్యులు నడుపుకునే ఇసుక ర్యాంపుల నుండి మాత్రమే ఇసుక సరఫరా కావాలే తప్ప మైనింగ్ అధికారులు మరియు సొసైటీ సభ్యులు అనుమతి లేకుండా గోదావరి ఇసుకను తరలించడం గాని, ఇష్టానుసారంగా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి, ఇసుక నిలువచేసు కొని అధిక ధరలకు అక్రమంగా ఇసుక విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడుఉదయం సారపాక లోని తాళ్ల గొమ్మూరు గోదావరి పరిసరాలలోని ఇసుక నిల్వలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ అధికారులకు పలు సూచనలు ఇస్తూ సోంపల్లి అధికారిక ఇసుక ర్యాంపుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అలాగే అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించి నిలువ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినందున ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. సొసైటీ సభ్యులు అధికారికంగా నిర్వహించే ఇసుక ర్యాంపుల నుండే ఇసుక సరఫరా కావాలని, అక్రమంగా ఇసుక తరలించకుండా గోదావరి ఇసుక ఉన్న ప్రదేశాలలో కంచెలు కానీ, కందకాలు కానీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు తప్పనిసరిగా గోదావరి పరిసరాలలోని కరకట్ట ప్రదేశాలలో 24 గంటలు ఇసుక అక్రమంగా తరలించకుండా నిఘా ఏర్పాటు చేయాలని, ఎవరైనా సభ్యుల అనుమతి లేకుండా అనధికారికంగా ఇసుకను తరలించే వారి వాహనాలను సీజ్ చేసి ఇసుక సరఫరా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని అన్నారు. ఇకనుండి తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఇసుక ర్యాంపులను తనిఖీ చేస్తూ ఉంటానని సబ్ కలెక్టర్ తెలిపారు. అధికారికంగా ఇసుక ర్యాంపులు నిర్వహించే సభ్యులు అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా మీయొక్క ఇసుక ర్యాంపులను నిర్వహిస్తూ ప్రజల వద్ద అధిక ధరలు వసూలు చేయకుండా నిర్ణయమైన ధరలకు మాత్రమేఇసుక సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇసుక రాంపులను పరిశీలించినందుకు సబ్ కలెక్టర్ శ్రీ మృనాల్ శ్రేష్ట కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిటి సమ్మయ్య మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.