ఘనంగా వీడ్కోలు
తిరుమలగిరి 20 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండలం ఎంపీడీవో కార్యాలయంలోని వెలిశాల పంచాయితీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ధరావత్ భీమ్జా , రాజ్యనాయక్ తండా పంచాయతీ కార్యదర్శి కోరుదుల కిరణ్ నాగారం మండలానికి మరియు జలలుపురం పంచాయతీ మేడబోయిన రాధిక సూర్యాపేట మండలానికి మరియు మర్రికుంట తండా పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఇర్ఫాన్ మోతే మండలానికి బదిలీపై వెళ్లిన సందర్భంగా తిరుమలగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాజరు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో తిరుమలగిరి మండల పంచాయతీ అధికారి , మండల కార్యదర్శులు, మండల ఉపాధి హామీ సిబ్బంది మరియు తిరుమలగిరి మండల మినిస్టీరిల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.....