ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో గ్యాస్ కనెక్షన్లు
జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (MDM) నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు గాను, *ఈరోజు మండల విద్యాశాఖ అధికారి, ఇటిక్యాల శ్రీ వెంకటేశ్వర్లు * ఇటిక్యాలలోని *Bhanu Indane Gas Agency ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల గ్యాస్ కనెక్షన్ దరఖాస్తులు, పాఠశాలల విద్యార్థుల సంఖ్య, అలాగే నెలకు అవసరమయ్యే గ్యాస్ సిలిండర్ల వివరాలను భాను ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు సమర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి పాఠశాలకు అవసరమయ్యే సిలిండర్ల వివరాలను సమగ్రంగా అందజేయడం జరిగింది.
భాను ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు స్పందిస్తూ, అందిన వివరాలను పరిశీలించి సోమవారం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కాజా పాల్గొన్నారు.