వానాకాలం సీజన్ కు కందులు మీ రైతు వేదికలలో అందుబాటులో ఉన్నాయి.
ఇటిక్యాల వ్యవసాయ అధికారి రవికుమార్.
జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం కు వానాకాలం సీజన్ కు గాను కందులు పి. ఆర్. జి -176 రకము విత్తనాలు 9.88 క్వింటాలు, ఎల్ . ఆర్.జి - 52 రకము 5 క్వింటాలు, ఆశ రకము 5 క్వింటాలు సరఫరా చేయడం జరిగింది. ఒక క్వింటమ్ పూర్తి ధర 13000, సబ్సిడీ ధర ఒక క్వింటమ్ కు 3000. రైతు చెల్లించవలసిన ధర 10000. ఎల్. ఆర్. జి 133-33 రకము విత్తనాలు 5 క్వింటాలు సరఫరా చేయడం జరిగింది. ఒక క్వింటమ్ పూర్తి ధర 13000. సబ్సిడీ ధర ఒక క్వింటమ్ 6000. రైతు చెల్లించవలసిన ధర ఒక క్వింటమ్ 7000. కంది విత్తనాలు కావలసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మీ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి కంది విత్తనాలు తీసుకోవాలని మండల ప్రజలను మండల వ్యవసాయ అధికారి ప్రజలను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజలని కోరుతున్నారు.