తిరుమలయ్య స్వామి సన్నిధిలో పూజలు అభిషేకాలు నిర్వహించిన.
కురువ ముక్కన్న కుటుంబ సభ్యులు.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మండలం చాగాపురం గ్రామంలోని చాగాపురం శాంతినగర్ రోడ్డు ప్రక్కన ఉన్న తిరుమలయ్య స్వామి వారి సన్నిధిలో బుడ్డారెడ్డి పల్లె గ్రామానికి చెందిన కురువ ముక్కన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమావతి అమావాస్య సందర్భంగా పూజారి రుద్రయ్య ఆలయంలోని వినాయకుని స్వామికి అభిషేకం వెంకటేశ్వర స్వామికి అభిషేకం అష్టోత్తర శతనామావళి నిర్వహించి నైవేద్యం అనంతరం మహా మంగళహారతి ఇచ్చి భక్తులకుతీర్థప్రసాదములు అందజేశారు.
అన్నదాత. కురువముక్కన్న రెండవ కుమారుడు తిమ్మప్ప రాజేశ్వరమ్మ తిరుమలేష్ (పంచాయతీ కార్యదర్శి) సంధ్య విష్ణువర్ధన్ సురేష్ రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.