బూత్ లెవెల్ అధికారులకు అవగాహన

Jun 19, 2026 - 22:11
Jun 19, 2026 - 22:49
 0  4
బూత్ లెవెల్ అధికారులకు అవగాహన

తిరుమలగిరి 20 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :-  తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రైతు వేదికలో మండల అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులు మరియు బూత్ లెవెల్ సూపర్వైజర్లకు స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సర్వే పైన అవగాహన కోసం ట్రైనింగ్ జరిగింది. ఎలక్ట్రోల రిజిస్ట్రేషన్ అధికారి బి.హరి సింగ్ మాట్లాడుతూ SIR ప్రక్రియను చాలా జాగ్రత్తగా మరియు అన్ని వివరములను సేకరించాలని 2002 ఓటర్ లిస్టును దగ్గర ఉంచుకొని ప్రస్తుత ఓటర్ లిస్టును దగ్గర ఉంచుకొని మ్యాపింగ్ చేయాలని చనిపోయిన వారి మరియు గ్రామంలో లేని వారిని డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని మరియు ఈనెల 26 నుండి వచ్చేనెల 24 వరకు ఎనిమిరేషన్ ఫారం లను పంపిణీ చేసి తిరిగి ఓటర్ల నుండి తీసుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యతగా గుర్తించి అందరూ సహకరించాలని అందుకు గాను రాజకీయ పార్టీల బూతు లెవెల్ ఏజెంట్లు మీకు సహకరిస్తారని అడిషనల్ కలెక్టర్ సూర్యాపేట తెలిపారు ఈ శిక్షణలో తిరుమలగిరి తహసిల్దార్ బి.హరి ప్రసాద్, డిటి జాన్ మహమ్మద్ సూపర్వైజర్లు అనిత ,సుభద్ర, కిషన్ స్థానిక సర్పంచ్ స్వాతి కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి