యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..... ఎస్ఐ ప్రవీణ్ కుమార్

Jun 22, 2025 - 12:42
 0  11
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..... ఎస్ఐ ప్రవీణ్ కుమార్

మునగాల 22 జూన్ 2025

తెలంగాణ వార్త ప్రతినిధి 

యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు,ప్రజలకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకోవద్దన్నారు.మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురి కాకుండా చూడాలన్నారు.సరదాగా మత్తు పదార్థాలను అలవాటు చేసుకొని బానిసలుగా మారుతున్నారని పిల్లల నడవడిక పై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని అన్నారు.నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న ఈ విషయన్ని గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా దాని నుండి ఆదిలోనే తుంచి వేయాలని కోరారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State