మోగిన బడిగంటలు అన్ని సౌకర్యాలతో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు

Jun 12, 2024 - 20:14
Jun 12, 2024 - 21:41
 0  4

మోగిన బడిగంటలు అన్ని సౌకర్యాలతో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు

తెలంగాణ వార్త:- పెన్ పహాడ్ కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలల పునః ప్రారంభం రోజు జూన్ 12 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెన్ పహాడ్ నందు మండల విద్యాధికారి నకిరేకంటి రవి గారి అధ్యక్షతన మండల జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య గారు ముఖ్యఅతిథిగా ప్రారంభోత్సవ కార్యక్రమం కి హాజరై జెడ్పిహెచ్ఎస్ పెన్పహాడ్, కేజీబీవీ మరియు ప్రాథమిక పాఠశాల పెన్పహాడ్, ప్రాథమిక పాఠశాల సీతారాంపురం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఒక జత యూనిఫాం దుస్తులు ,అందించినారు మామిడి అనిత అంజయ్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం ,మధ్యాహ్న భోజనం, వారానికి మూడు గుడ్లు, నాణ్యమైన విద్య, అందిస్తున్నందున విద్యార్థులు ఇట్టి సౌకర్యాలను ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాయని, కాబట్టి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అందుకు తల్లిదండ్రులు గ్రామంలోని విద్యావేత్తలు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు సహకరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపితం చేయాలని కోరినారు . ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిఎం సివిల్ సప్లై రాములు గారు ,తాసిల్దార్ మహేందర్ రెడ్డి ,ఎంపీ ఓ నరేష్ ,ఏపిఎం అజయ్ ,మండల సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంఘ బంధాల వివోఏలు పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State