మైనింగ్ పేరు మీద పట్టా చేసిన రెవెన్యూ అధికారులు
మైనింగ్ కార్యకర్తలు వెంటనే నిలుపుదల చేయాలి
రాజకీయ నాయకుల కను సైగళ్లలో ములుగు జిల్లాలో ఉన్న రెవెన్యూ సిబ్బంది
అక్రమ పట్టాలపై చర్యలు తీసుకోవాలి
తమ భూమిని ఇతరుల పేర్లపై పట్టా చేశారని ఆరోపణ
ములుగు జిల్లా, ఆగస్టు 31:- జేడీ మల్లంపల్లి మల్లంపల్లి మండలం రామచంద్రాపురం శివారులోని సర్వే నంబర్ 3293లో తమ కుటుంబానికి చెందిన భూమిని తమకు తెలియకుండా ఇతరుల పేర్లపై అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ భూమ స్వామి కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.అక్రమంగా జరిగిన పట్టా మార్పిడులను రద్దు చేసి తమ భూమిని తమ పేర్లపై పట్టా చేయాలని వారు కోరారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. బొల్లోనపల్లి గ్రామానికి చెందిన భూమ స్వామి తండ్రి భూమ లక్ష్మయ్య పేరున సర్వే నంబర్ 3293, ఖాతా నంబర్ 1517లో 2(రెండు )ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ భూమిని తమ కుటుంబం సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తమకు ఎలాంటి సమాచారం అనుమతి లేకుండా భూమిలోని 1 ఎకరం 32 గుంటలను ఇతరుల పేర్లపై పట్టా మార్పిడి రెవిన్యూ అధికారులు చేసినట్లు ఆరోపించారు.రామచంద్రాపురం గ్రామానికి చెందిన మార్త సదానందం తండ్రి రాజయ్య తమ భూమిలోని 0.36 గుంటలను క్యాతం ప్రవళిక భర్త రమేష్ పేర్లపై పట్టా చేయించినట్లు మరో 0.36 గుంటలను ఓ మైనింగ్ పేరున పట్టా చేయించినట్లు ఫిర్యాదులో తెలిపారు.సదరు భూమిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు సమస్య పరిష్కారానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడమే కాకుండా తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.అధికారులు సమగ్ర విచారణ చేపట్టి భూమి రికార్డులను పరిశీలించి అక్రమ పట్టాలను రద్దు చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో భూమ స్వామి స్వరూప జనార్దన్ చంద్రమౌళి కవిత ప్రవీణ్ పూల సతీష్ మేఘ అర్జున్ సందీప్ ఉన్నారు.