మెకానిక్ లకు అండగా ఉంటాం : రాందేని ఆదినారాయణ
సూర్యాపేట ట్రాక్టర్ మెకానిక్ ఆకుల రవి అకాల మరణం చెందాడు భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారు నిరుపేదలు వారి కుటుంబానికి సూర్యాపేట ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ తరపున గురువారం మృతుని నివాసంలో 91000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది సూర్యాపేట ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు రాందేని ఆదినారాయణ గారు మాట్లాడుతూ ఏ పేద మెకానిక్ చనిపోయినను వారి కుటుంబానికి అసోసియేషన్ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. యూనియన్ లో ఇలాంటి సంఘటనలు తోటి మెకానికుల మరణాలు జరిగినప్పుడు సభ్యులు అందరూ అండగా ఉండాలని, తోచినంత ఆర్థిక సహాయం చేసి సహకరించాలని, మన సభ్యులలో చాలామంది నిరుపేదలే ఉన్నారని, వారికి ఏ ఆపద వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలబడాలని, కుటుంబంలో ఒక మగ దిక్కు కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పలేము, కాబట్టి మన యూనియన్ సభ్యులందరూ ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ముందుండి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మృతుని భార్య ఆకుల నవ భారతి, కుమారుడు సిద్దు, కుమార్తె అక్షర, యూనియన్ ఉపాధ్యక్షుడు కుంచారపు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పలస మహేష్ గౌడ్, కోశాధికారి వాసంశెట్టి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి నిమ్మల కోటి లక్ష్మణ్, మరియు సలహాదారులు పందిరి పెళ్లి శ్రీనివాసరావు, అనుముల పుల్లయ్య చారి, సుంకు కృష్ణ, ఎస్కే కాజా మియా, శంకర్ మరియు కార్యవర్గ సభ్యులు ట్రాక్టర్ మెకానికులు పాల్గొన్నారు.