మున్సిపల్ లో తొలి రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలు
తిరుమలగిరి 29 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
తొలి రోజు 9 నామినేషన్లు మాత్రమే...
ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు...
పోటీలో యువత ఆసక్తి..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా డిఎస్పి ప్రసన్న కుమార్ ఆర్డీవో వేణుమాధవ సీఐ నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు తహసిల్దార్ హరి ప్రసాద్ అధికారులు పరిశీలించారు పకడ్బందీగా నామినేషన్లు నిర్వహించాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు అనంతరం నామినేషన్ల పర్వం మొదలు కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలి రోజు బుధవారం నాడు 15 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ తరపున 3 వార్డు కందుకూరి లక్ష్మయ్య ,12వ వార్డు పత్తేపురం సుమలత, 14వ వార్డు దుంపల కృష్ణారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ తరఫున 7 వార్డు ఏనుగుల నాగన్న ,అభ్యర్థి ఒక్కరు ,,బిజెపి పార్టీ తరపున 2 వార్డ్ అంబటి మహేష్ ,3 వార్డు వాటం బాలరాజు ,7 వార్డు వేల్పుల రమేష్ ,15వ వార్డు మాచర్ల కార్తీక్ , స్వతంత్ర అభ్యర్థి 4 వార్డు ముద్ర పోయిన పూలమ్మ ... మొత్తం 9 నామినేషన్ దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు....