మున్నేరు రక్షణ గోడలకు 250 ఎకరాలు అవసరమా
170 ఎకరాలు పట్టా భూములు ఉంటే...2013 భూ సేకరణ చట్టం ప్రకారం చర్యలు ఉండాలి కదా...?
బలవంతపు సేకరణపై వెల్లుబిగుతున్న నిరసనల
పర్వం...!
2026 మార్చి నాటికి పూర్తి చేసేందుకు వేగంగా భూ సేకరణకు రంగం సిద్ధం...?
పరిహారం ప్యాకేజీల సంగతి ఏంటో...!
ముందస్తు సమాచారం లేకుండా ఆగ మేఘాలపై సేకరణకు మోహరించిన యంత్రాంగాలు..?
గత వర్షాకాలంలో మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం పట్టణంతో పాటు పరిసర గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకొని అపార నష్టం కలిగించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్నేరు పరివాహక ప్రాంతంలో సుమారు 690 కోట్ల రూపాయల వ్యయంతో 17 కిలోమీటర్ల దూరం వరకు మున్నేరుకు ఇరువైపులా రక్షణ గోడను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసి ఒక సంస్థకు కాంట్రాక్టు అప్పగించిన నేపథ్యంలో పనులు జోరుగా సాగుతున్న వేళ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు నోటీసులు లేకుండా గడువులోగా పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కాంట్రాక్టు పొందిన సంస్థ ఆగ మేఘాల మీద భూ సేకరణ ప్రక్రియకు యంత్రాలను యంత్రాంగాలను మోహరించి 2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ బలవంతపు సేకరణకు గుత్తేదారు సంస్థ ప్రభుత్వ యంత్రాంగాలు ప్రయత్నించడంతో ఖమ్మం రూరల్ ఖమ్మం అర్బన్ ఖమ్మం టౌన్ ప్రాంతాలలో నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 250 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 17O ఎకరాలు పట్టా భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డివిజనల్ అధికారి ద్వారా కలెక్టరేట్ పరిధిలో ప్రభుత్వానికి నివేదిక స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కానీ ఎటువంటి ముందస్తు నోటీసులు హెచ్చరికలు లేకుండా గడువులోగా పనులను పూర్తి చేసేందుకు సదరు గుత్తేదారు సంస్థ నిర్వాహకులు సిబ్బంది బలవంతపు భూ సేకరణకు రంగం సిద్ధం చేసి భారీ యంత్రాలు జెసిబిల సాయంతో ఇష్టానుసారంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 300 మంది నిరాశ్రయులు అయ్యే అవకాశం ఉన్నదని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండగా అందుకు భిన్నంగా సదరు గుత్తేజారు సంస్థ అధికార యంత్రాంగాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా సేకరణకు చేయటం తో బాధితులు ఆగ్రహం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టా భూముల్లో ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం పట్ల నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మున్నేరుకు ఇరువైపుల రక్షణ గోడ నిర్మాణానికి ఖమ్మం రూరల్ మండలంలో 70 ఎకరాలు ప్రభుత్వ భూమిని మరో 7O ఎకరాలు ప్రైవేటు భూమిని సేకరించేందుకు చర్యలు ముమ్మరం చేయటంతో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. మల్లెమడుగు రామన్నపేట గ్రామాల సమీపంలో రెండు కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 230 మీటర్ల మేర గోడలకు మధ్య దూరాన్ని నిర్ణయించి పనులు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల వర్షాకాలంలో వచ్చిన వరదలు ఖమ్మం పట్టణంతోపాటు ఖమ్మం రూరల్ అర్బన్ గ్రామాలలో మున్నేరు బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటాయించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మున్నేరు ప్రవాహం నుండి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకొని పనులు జోరుగా సాగుతున్న వేళ ప్రభుత్వ గడువులోగా పనులు పూర్తి చేయాలని సదరు గుత్తేదారు సంస్థ నిరాశ్రయులకు ఎటువంటి సమాచారం ఆమోదం లేకుండా పరిహారం చెల్లించకుండా బలవంతపు సేకరణకు పాల్పడటం ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చొరవ తీసుకొని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం బాధితుల ఆమోదం మేరకు భూసేకరణ చేసి మున్నేరు ఉగ్రరూపం నుండి ఖమ్మం అర్బన్ ఖమ్మం రూరల్ ఖమ్మం టౌన్ ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని పలువురు బాధితులు జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.