ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేత....

మునగాల 13 జనవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండల కేంద్రంలో రాళ్ళబావి సెంటర్ లో అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ రామాకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.అనంతరం ముగ్గుల పోటీలలో పాల్గొన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మా నాన్న ఫౌండేషన్ వారి సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను పండుగను మరవద్దని అయన అన్నారు. రానున్న రోజుల్లో అమ్మా నాన్న ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎల్వీ ప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో శాఖమూడి అప్పారావు,లకుమారపు నాగరాజు,న్యాయ నిర్ణేతలుగా ప్రజ్ఞ స్కూల్ ప్రిన్సిపాల్ స్వర్ణలత,విజయ, శ్వేత, లక్ష్మణ్, వినయ్,అఖిల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.