ఘనంగా సంక్రాంతి బోగి వేడుకలు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఘనంగా సంక్రాంతి బోగి వేడుకలు ఆత్మకూరు ఎస్.. ఇల్లముందు రంగవాళ్లులు తెల్లవారు జామున బోగి మంటలు.. ఆత్మకూరు ఎస్.. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా సోమవారం మండలం లో నీ గ్రామాల్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ ముందు రంగుల ముగ్గులతో మహిళలు రంగవల్లులు చేశారు. ముగ్గుల మధ్య ఆవు పేడతో గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము బోయి మంటలు వేసి చలికాచుకున్నారు. మండలంలోని గట్టికల్లు, తుమ్మల పెన్పాడు, గ్రామాలలో క్రీడలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించారు.