మాదక ద్రవ్యాల నియంత్రణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదికారి డాక్టర్ పెండెం వెంకటరమణ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు బౌషద నియంత్రణ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో “మాదకద్రవ్యాల నియంత్రణ మరియు నిబంధనల బలోపేత దినోత్సవం” యొక్క ర్యాలీని అంబేడ్కర్ విగ్రహం, ఖమ్మం క్రాస్ రోడ్ నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా పెండెం వెంట రమణ ప్రారంభించి స్థానిక పద్మశాలి భవన్ వరకు నిర్వహించారు. అనంతరం పద్మశాలి భవన్ లో నిర్వహించిన అవగాహనా సమావేశంలో పాల్గొని ఏప్రిల్ 6 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు జరుపుకొనుచున్న ఆరోగ్య వారంలో అరోగ్య అవగాహనా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి సమాజాన్ని ఆరోగ్య విద్యా ప్రేరణ పెంపొందించామని ఆయన అన్నారు. నేడు మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి, అవగాహన పెంచడానికి, నివారణ చర్యలను బలపరచడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, సమాజం తమ వంతు కృషి చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అందువల్ల కుటుంబం మరియు సమాజం పై ప్రభావం చూపుతున్నదన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులని, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
వైద్య చికిత్సలో తన స్వీయ అనుభవంలో జరిగిన విషయం ప్రస్తావిస్తూ 6 సం. బాలుని చేతి వ్రేలు ప్రమాదంలో తెగినప్పుడు తల్లిదండ్రుల సమ్మతి మరియు సమక్షంలో తగినంత మత్తు ఇచ్చి చికిత్స చేయటం జరిగినదని, అయిననూ మత్తులో పిల్లవాడు వున్నప్పుడు తల్లిదండ్రులు బాధకు గురవటం జరిగినదని తెలియజేశారు. ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు వైద్యుల సూచనలు పాటిస్తూ మాత్రమే డ్రగ్స్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిజిఎమ్ సూపరింటెండెంట్ డా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యున్నతికి ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కొరకు పట్టణ ప్రాంతాలకు పంపినప్పుడు వారు ఇటువంటి దురాలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృస్తి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నామన్నారు.
సూర్యాపేటలో మానసిక వైద్య చికిత్స కేంద్రం నిపుణులచే ఏర్పాటు చేయబడినదని, ఎటువంటి మానిక ఒత్తిడి, సంఘర్షణ వున్న వైద్య నిపుణుల సలహా, సూచనలు పాటించాలన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ మాట్లాడుతూ వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్ మందులు ఇవ్వరాదని, యాంటీ బయాటిక్స్ వాడకం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాడాలని, ఈ కార్యక్రమం విజయవంతగా నిర్వహణకు తోడ్పడిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి గారికి ప్రత్వెక కృతజ్ఞతలు
తెలియజేశారు.
ఈగల్ సెల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డ్రగ్ టెస్ట్ లో 200 పాజిటివ్ వచ్చాయని, మానసిక, కుటుంబ సమస్యల వలన కొకైన్, తంబాకు, గుట్కా డ్రగ్స్ వాటికి బానిసలవుతున్నారని, విద్యార్థిగా వున్నపుడు డ్రగ్స్ తీసుకుని తమపై కేసులు నమోదై తమ భవిష్యత్తు ఆగమ్యగోచరం చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భముగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి వీటిలో గెలుపొందిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా పెండెం వెంకట రమణ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి, సైకియటిస్ట్ డా వివాసవన్, పట్టణ సి.ఐ వెంకన్న, వికాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేశ్, డెమొ సంజీవ్ రెడ్డి, జిల్లా కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అద్యక్షుడు యమ ప్రభాకర్, పట్టణ అద్యక్షుడు పెండెం విజయ్, ఫార్మాసూటికల్స్ అద్యక్షుడు ముషమ్ హరి, కృష్ణమూర్తి, ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రభుత్వ పారమెడికల్ కళాశాల వందన, చందన, తిరుమల, నిర్మల కళాశాలల సిబ్బంది, విద్యార్థులు
పాల్గొన్నారు.