అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే

Apr 11, 2026 - 22:36
Apr 11, 2026 - 22:49
 0  4
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే

తిరుమలగిరి 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

   మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. శనివారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మందుల సామెల్, పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలేను గొప్ప సంఘ సంస్కర్తగా అభివర్ణించారు.సుమారు 1888 సంవత్సరంలో, ఆయన సామాజిక సేవలను గుర్తించి ప్రజలు, ఆయనను మహాత్మా అని సంబోధించేవారని తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. సమాన హక్కులు, విద్యావ్యాప్తి కోసం కృషి చేయడం ద్వారా సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పూలే ఆలోచనలు నేటి తరానికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి