మహిళా సర్పంచ్ లకు అవమానం

Jan 21, 2026 - 22:31
 0  0
మహిళా సర్పంచ్ లకు అవమానం

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ మహిళా సర్పంచ్ లకు అవమానం. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ భర్త...... రాజ్యాంగంలోనూ చట్టసభల్లోను మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించేందుకు ఎన్నో ఉద్యమాల పలితంగా కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం గెలిచిన మహిళా సర్పంచ్ లకు విధి నిర్వహణలో భర్తల పెత్తనం తప్పడం లేదు. ఉన్నత పదవుల్లో పట్టింపు లేనప్పటికీ కనీసం గ్రామస్థాయి సర్పంచ్ పదవిలోనైనా మహిళలకు ప్రాధాన్యత కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామ సర్పంచ్ గత డిసెంబర్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచినప్పటికీ చట్టసభలకు వచ్చేసరికి భర్త పెత్తనం పెరిగిందని ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బుధవారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం అధికారులు ఆయా గ్రామాల సర్పంచులకు ఆహ్వానం పంపగా నెమ్మికల్ సర్పంచ్ జటంగి గణిత కు బదులు వారి భర్త రామనర్సు వెళ్ళి చెక్కల పంపిణీలో పాల్గొన్నారనీ ఆరోపించారు. స్వయంగా తాహసిల్దార్ అమీన్ సింగ్ సమక్షంలో నెమ్మికల్ చెందినలబ్ది దారుల కళ్యాణ లక్ష్మి చెక్కులను సర్పంచ్ కి బదులు భర్త రామనర్సు పంపిణీ చేయడం విచారకరమని మహిళా హక్కులను కాలరాస్తున్నారని గ్రామ మాజీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి మధు ఆరోపించారు. గ్రామపంచాయతీకి సర్పంచ్ గణితను రాకుండా ప్రతిసారి భర్త రామనర్సు విధులకు హాజరవుతున్నారని ఆయన ఆరోపించారు. భార్య సర్పంచ్ గా ఉండగాభర్త పెత్తనం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నట్లు తెలిపారు.