హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం.

Sep 18, 2024 - 19:36
 0  3
హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం.

డెలివరీ కాకపోవడంతో కాలుతో పొట్టను తొక్కి డెలివరీ చేసిన నర్సులు

పరిస్థితి విషమించి మృతి చెందిన పసి బాలుడు గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసిన ఇద్దరు నర్సులు.. పుట్టిన పసి బాలుడు మృతి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రం పోడు తండాకు చెందిన రేణుకకు పురిటి నొప్పులు రావడంతో హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం రోజు చేరింది. ఆదివారం ఉదయం నుంచి తన భార్య నొప్పులతో బాధపడుతున్న డాక్టర్లు పట్టించుకోకపోవడంతో.. భర్త నిలదీయడంతో సోమవారం ఉదయం ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు. డెలివరీ కాకపోవడంతో నర్సులు కాలుతో పొట్టను తొక్కడంతో బాబు బయటకు వచ్చాడు.. కానీ బాబు పరిస్థితి విషమించడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు.. దీనిపై కుటుంబ సభ్యులు హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333