మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మరియు ఉపాధి అవకాశం

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మరియు ఉపాధి అవకాశం. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలాల్లో ప్రతి గ్రామ పంచాయితీ కి ట్రైనింగ్ సెంటర్ చొప్పున మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరము సర్టిఫికెట్ మరియు ఉపాధి కల్పిస్తారని గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కట్కూరి సైదిరెడ్డి అన్నారు. ఈరోజు ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్ గ్రామంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని గ్రామ కార్యదర్శి లింగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల కోర్డినెటర్ షైక్ నజిమ ,బుడిగే లింగయ్య,సనబోయిన రజిత సుధాకర్,దామిడి శ్రీనివాస్, మరియు స్టూడెంట్స్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్డినెటర్ సైదులు 7674974021 మండల కోర్డినెటర్ నజిమ 9705635987 ను సంప్రదించండి