మట్టి విగ్రహాలనే పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి""కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ బాబు

Aug 26, 2025 - 17:56
Aug 26, 2025 - 19:41
 0  4
మట్టి విగ్రహాలనే పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి""కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ బాబు

మట్టి విగ్రహాలనే పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి

మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ బాబు

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ  :  మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నివాసంలో 500 మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు పట్టణంలో మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు అన్ని జాగ్రత్తలు పాటించి పూజలు జరుపుకోవాలని అన్నారు అదేవిధంగా ప్లాస్ట ఆఫ్ ప్యారిస్ తో రంగురంగుల రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలు నీటిలో కలుషితమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కనుక మట్టి తో తయారు చేసిన విగ్రహాలనే వాడాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ టిపిరిశెట్టి రాజు కాజా గౌడ్ ఒంటి పులి రమా శ్రీనివాస్ ఎర్రవరం సొసైటీ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు రావిళ్ళ కృష్ణారావు లైటింగ్ ప్రసాద్ నెమ్మాది దేవమణి ప్రకాష్ బాబు మేకపోతుల సత్యనారాయణ గంధం పాండు ఆర్ వెంకటేశ్వరరావు గోల్డ్ షాప్ రమేష్ పారా వెంకటేశ్వరరావు మల్లు నాగిరెడ్డి తోకల విజయ చామర్తి బ్రహ్మం వేమూరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State