అమ్మ నాన్న జ్ఞాన మందిరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరికి సిలిండర్లు, స్టవ్ లు పంపిణీ
సహాయ సహకారాలు అందించిన వారు నితిన్ సాగర్, ఎం. లక్ష్మయ్య వాల్మీకి
పంపిణీ చేసిన అమ్మానాన్న జ్ఞాన మందిరం ఫౌండేషన్
ఫౌండేషన్ చైర్మన్ తిరుపతయ్య వంశ రాజ్
చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : కొల్లాపూర్ నియోజక వర్గము, పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో మరియు మంచాల కట్ట గ్రామాలకు చెందిన రెండు కుటుంబాలకు గంధం బాలయ్య, సులిగిరి మశన్నలకు అమ్మానాన్న జ్ఞాన మందిరం ఫౌండేషన్ పెద్దూరు గ్రామం తెలకపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా వారు ఆదివారం వారికి సిలిండర్, స్టవ్ లు పంపిణీ చేశారు. అమ్మానాన్న జ్ఞాన మందిరం ఫౌండేషన్ చైర్మన్ తిరుపతయ్య వంశ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటి వారికి సేవలు ఎల్లపుడు ఏదో ఒక రూపంలో చేస్తూ ఉండాలని తెలిపారు. సేవలు సహాయ సహకారాలు అందించడం గొప్ప పుణ్యం గా భావించాలని తెలిపారు. వారికి ఈ యొక్క సహకారం నితిన్ సాగర్, ఎం లక్ష్మయ్య వాల్మీకి, వారి నుంచి అందిందని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. బాధితులైన బాలయ్య, మశన్నలు వారి కుటుంబ సభ్యులు ఆ ఫౌండేషన్ చైర్మన్ తిరుపతయ్య వంశ రాజ్ లకు ప్రత్యేక నమస్కారాలు తెలుపుకొని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వారు యేసు వంశ రాజ్ ఆయా గ్రామ ప్రజలు, రాము, తరుణ్, మంజునాథ్, పెద్దలు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.