భూ భారతి సదస్సు ను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఆర్డిఓ

Jun 13, 2025 - 20:44
 0  2
భూ భారతి సదస్సు ను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఆర్డిఓ

తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్ భూ భారతి సదస్సును పరిశీలించిన అదనపు కలెక్టర్ ఆర్డఓ. ఏపూర్ గ్రామ పంచాయతీ లో జరుగుతున్న భూ భారతి సదస్సు ను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు పరిశీలించారు. భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రైతులతో మాట్లాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి సదస్సులు ముగిసిన అనంతరం గ్రామలలో వచ్చిన దరఖాస్తులను విచారిస్తామన్నారు.అనంతరం ఏపూర్ దాచారం గ్రామాల లో రేషన్ దుకాణాలలో రికార్డులను రేషన్ బియ్యాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్ రావు, తహసిల్దార్ అమీన్ సింగ్, ఆర్ ఐ ప్రదీప్ , సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.