భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

Jun 12, 2025 - 19:57
 0  16
భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా అదునపు కలెక్టర్‌ లక్ష్మి నారాయణ అన్నారు గురువారం ధరూర్ మండలంలోని చింతరేవుల గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూములపై రైతులకు పూర్తి హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.అన్ని రకాల భూ సమస్యలకు భూ భారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల వివరాలతో సంబంధిత ఫారాలను నింపి సమర్పించాలని సూచించారు.అధికారులు ప్రతిరోజూ దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అప్డేట్ చేయాలనీ ఆదేశించారు. ఫారాల స్వీకరణ నుండి ఆన్‌లైన్ నమోదు వరకు ప్రతి దశలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలనీ, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని,భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్,రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333