ఘోర విమాన ప్రమాదం దురదృష్టకరం

గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి .
మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు సంతాపం
జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదా బాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉన్న బిజె మేడికల్ కాలేజీపై పడింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తో పాటు మెడికల్ విద్యార్థులు, మహిళలు, చిన్నారులు మరియు విదేశీయులు పెద్ద మొత్తంలో మృత్యువాత పడటం దురదృష్టకరం. మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కారాదని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు.