హుజూర్నగర్ క్రైస్తవుల సమాధుల తోటకు డెబ్భై లక్షలతో ప్రహరీ గోడ పనులు వేగవంతం చేసిన

Sep 28, 2024 - 20:01
 0  9
హుజూర్నగర్ క్రైస్తవుల సమాధుల తోటకు డెబ్భై లక్షలతో ప్రహరీ గోడ పనులు వేగవంతం చేసిన
హుజూర్నగర్ క్రైస్తవుల సమాధుల తోటకు డెబ్భై లక్షలతో ప్రహరీ గోడ పనులు వేగవంతం చేసిన
హుజూర్నగర్ క్రైస్తవుల సమాధుల తోటకు డెబ్భై లక్షలతో ప్రహరీ గోడ పనులు వేగవంతం చేసిన

తెలంగాణా రాష్ట్ర మంత్రి కెప్టెన్ యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపిన హుజూర్నగర్ పాస్టర్స్

శనివారం 28 సెప్టెంబర్ :స్థానిక హుజూర్నగర్ పట్టణ కేంద్రం నందు ఇండిపెండెంట్ పాస్టర్స్ మరియు క్రైస్తవులు పలువురు క్రైస్తవుల సమాధుల తోట పనులను పరిశీలించి తెలంగాణా రాష్ట్ర పౌర సరఫరాల మరియు నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా హుజూర్నగర్ పాస్టర్స్ పెలోషిఫ్ మాజీ చైర్మన్ రెవ. డా. మీసా దేవసహాయం, హుజూర్నగర్ నియోజకవర్గ చైర్మన్ పాస్టర్స్ రెవ. తలకప్పల సుధాకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. డా. జి డేవిడ్ రాజు లు మాట్లాడుతూ గత 75 సంవత్సరాలనుండి క్రైస్తవులకు సమాధుల తోట లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ గత ఎలక్షన్స్ కు ముందు క్రైస్తవ నాయకులు  హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కెప్టెన్ యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రుష్టి కీ ఎలక్షన్స్ ముందు తీసుకెళ్లగా నేను గెలిచిన వెంటనే క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తానని మాట ఇచ్చి గెలవగానే రూ.50 లక్షలు కేటాయించి సమాధుల తోట పనులు ప్రారంభించిన ఘనత మంత్రి కె దక్కిందని, అది మాత్రమే కాకా పనులు సాగిస్తుండగా డబ్బులు సరిపోకపోవడంతో మళ్ళీ రూ. 20 లక్షలు కేటాయించి క్రైస్తవుల అండగా నిలిచినా మంత్రి కీ హుజూర్నగర్ నియోజకవర్గ మరియు పట్టణ పాస్టర్స్  మరియు క్రైస్తవులు కృతజ్ఞతలు తెలుపుతూ వారికీ రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ రెవ. అన్నేపాక రవికాంత్,పాస్టర్ కె.కృపాన0దo  నియోజకవర్గ ప్రెసిడెంట్ దేవదానం. నియోజకవర్గ సెక్రటరీ పి.ఆమోసు, నియోజకవర్గ కోశాధికారి పి .పీటర్ హానోకు, హుజూర్నగర్ పట్టణ అధ్యక్షులు పి.జాషూవా,హుజూర్నగర్ మండల అధ్యక్షులు యస్.ప్రసాద్, పాస్టర్ 
జి. జాకబ్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333