భారీగా పెరిగిన టమాటా ధరలు

తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పెరిగాయి.
TGలోని HYD సహా జిల్లాల్లో నాణ్యమైన టమాటా కేజీ రూ.60-70 వరకు పలుకుతోంది. హోల్సేల్గా కేజీ రూ.40-50 వరకు ఉంది. అటు ఏపీలో విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో కేజీ రూ. 50-60గా ఉండగా జిల్లాల్లో రూ.35-45 వరకు పలుకుతోంది. అతిభారీ వర్షాలు, వరదలతో టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లకు సరఫరా గణనీయంగా తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.