భారత రత్న సేయింట్ మదర్ థెరిసా 115వ జయంతి ఆమె స్పూర్తితో
బేతెస్థ ఆధారము (ట్రస్ట్) ద్వారా చార్లెట్ ఆనాధ పిల్లల ఆశ్రమం లో పండ్ల పంపిణి
నిర్వహణ ధర్మకర్త దుర్గం కరుణ శ్రీ
సార్వత్రిక కార్యదర్శి మీసాల సైదులు
ఆర్ధిక ధర్మకర్త దుర్గం ప్రభాకర్
చివ్వేంల మంగళవారం 26 : చార్లెట్ ఆనాధ పిల్లల ఆశ్రమంలో భారత రత్న సేయింట్ మదర్ థెరిసా స్పూర్తితో బేతెస్థ ఆధారము (ట్రస్ట్) ద్వారా ఆనాధ పిల్లలకు పండ్ల పంపిణి కార్యక్రమం చేసిన నిర్వహణ ధర్మకర్త దుర్గం కరుణ శ్రీ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆనాధలకు, వ్యాధిగ్రస్థులకు అమ్మ అయినా మదర్ థెరిసా జన్మదినం రోజే మొదటి కార్యక్రమం చేపట్టటం నాకు చాలా ఆనందం గా వున్నదని, ఆమె స్పూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు బౌవిషత్ లో తలపెట్టనున్నామని అన్నారు సార్వత్రిక కార్యదర్శి మీసాల సైదులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఆల్ ఇండియా పెడరేషన్ అఫ్ మదర్ థెరిసా సోషల్ ఆర్గనైగజెషన్ చైర్మన్ ఆర్ధిక ధర్మకర్త దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ మదర్ థెరిసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసిందనీ1970 నాటికి మానవతా వాదిగా, పేద ప్రజల, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందిందనీ. అదిమాత్రమే కాకా ఈమె తన మానవ సేవకు గాను 1962లో పద్మశ్రీ పురస్కారమ, 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిందనీ, అది మాత్రమే కాకా ప్రపంచం వ్యాప్తంగా ఇంకా ఎన్నో అవాడ్స్ పొందుకున్నారని,మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్ (HIV/AIDS), కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించిందనీ ఆమె అనేక మంది వ్యక్తులచే, ప్రభుత్వాలచే, సంస్థలచే ప్రశంసింపబడిందని కొనియాడారు. ఈ కార్యక్రమం లో చార్లెట్ ఆనాధ పిల్లల ఆశ్రమం వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ జలగం జేమ్స్, సూర్యాపేట పట్టణ పెలోషిఫ్ అధ్యక్షులు పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొజ్జ ప్రశాంత్ కుమార్,చివ్వేంల మండలం అధ్యక్షులు రెవ జి. బాలాజీ నాయక్ సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల క్రిస్టోఫర్, రెవ పంది మార్క్, పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ మొరుగురి రూబెన్,రెవ టి. కిరణ్ బాబు, జాటోత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు