భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలేరియా అధికారుల నిర్లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం

Jun 25, 2025 - 18:33
 0  1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలేరియా అధికారుల నిర్లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం

కారణాలు చెబుతూ కాలం దాటేస్తున్న అన్ని ప్రాథమిక మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది, మందులు లేవు సౌకర్యాలు లేవు అంటూ వచ్చిన ప్రతి పేషంటును, భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్య బృందం

భద్రాచలం డివిజన్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు ఏరియా ఆసుపత్రులలో కనిపించని మలేరియా మందులు, గత కొన్ని నెలలుగా మలేరియా మందులు సప్లై ఆగిపోయిందని ఎన్నిసార్లు ఇండెంట్ పెట్టిన మందులు రావడంలేదని ఆయా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు వెల్లడిస్తున్నారు. వర్షాకాలం వచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం ప్రజల కోసమే ఉన్నామని ప్రజలని మభ్యపెడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న జిల్లా అధికార యంత్రాంగం. ఈ విధంగా మలేరియా మందులను సప్లై నిలిపివేయడం వల్ల పేదలు నిరుపేదలు మందులు అందక వైద్యం సరిగ్గా దొరకక నాటు మందుల దారి పట్టి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వైనం. వారి ప్రాణాలకు పూర్తి బాధ్యత జిల్లా యంత్రాంగమే, యువతరం పార్టీ.

ప్రజల ప్రాణాలు అంటే ఏమాత్రం లెక్కలేనట్టు వైనం, 
చిన్న కారణాల చేత మందులు లేవని సదుపాయాలు లేవని ఆదివారమైతే డాక్టర్ లేరని స్టాఫ్ రాలేదని ఆయా ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యశాలలకు వస్తున్న రోగులను వెంటనే భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలిస్తున్న వైనం. ఇదే ద్రోని కొనసాగిస్తున్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలు వీటివల్ల భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో బెడ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆటో చర్ల నుండి ఇటు దుమ్ముగూడెం నుండి మరియు చుట్టుపక్కల మండలాల నుంచి భద్రాచలం ఏరియా హాస్పిటల్కు పేషంట్ల రిఫర్ చేయడం వల్ల భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో వచ్చే పేషెంట్లకు బెడ్లు లేనటువంటి పరిస్థితి. అసలే వైద్యం అంతంతమాత్రంగా అందుతున్న పరిస్థితులు భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో ఎన్నో ఏళ్లగా చూస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి రిఫరల్ సిస్టం ప్రకారం కండిషన్ బేస్ చేసుకొని రిఫర్ చేయాలని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రతి చిన్న కారణం చేత డాక్టర్ గారు అందుబాటులో లేరని సిస్టర్ టైం కి రాలేదని మందులు లేవని కట్లు కట్టడానికి కూడా సరైన వసతులు లేవని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి వెళ్తే అన్ని దొరుకుతాయని పేషెంట్లకు చెప్పి 108 ద్వారా లేదా వారి సొంత వెహికల్ ద్వారా భద్రాచలం పంపుతున్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలు. ఎన్నో వేలకోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలు వాటిలో పనిచేస్తున్న డాక్టర్లు స్టాఫ్ మరియు ఇతర సిబ్బందికు లక్షల్లో జీతాలు కానీ కనీసం రోజుకి పదుల సంఖ్యలో ఓపీలు, అదేంటని రోగులను ప్రశ్నిస్తే అక్కడ ఎవరు చూస్తారు ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ లేరు ఎప్పుడు వెళ్ళినా అది లేదు ఇది లేదు అని రోగులు విలవిలాడుతున్న వైనం, గవర్నమెంట్ హాస్పటల్ అంటేనే భయపడుతున్న సామాజిక నిరుపేద కుటుంబాలు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ప్రైవేట్ దావకానాల కెళ్ళి వైద్యం తీసుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చివేయాలని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ని భద్రాచలం ఐటీడీఏ పిఓని జిల్లా వైద్య అధికారుల్ని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జులా వేణుగోపాల్ రెడ్డి, యువతరం పార్టీ వ్యవస్థాపకులు పోట్రు ప్రవీణ్ కుమార్ మరియు ఆంధ్రా రాష్ట్ర నాయకులు గుగులోతు బాబు నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు అజ్మీర నరేష్ నాయక్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333