బెట్టింగులు పెట్టడం నేరం ఎస్ఐ సత్యనారాయణ గౌడ్

- ఐపిఎల్ క్రికెట్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్ పై నిఘా.
- బెట్టింగ్ ప్రలోబాలకు గురిచేస్తే కటిన చర్యలు తప్పవు.
- బెట్టింగ్ సంస్కృతికి దూరంగా ఉండాలి.
తిరుమల ఎస్ఐ సత్యనారాయణ.
తిరుమలగిరి 01 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ఐపీఎల్ క్రికెట్ నిర్వహణ సందర్భంగా మండలంలో బెట్టింగ్ లాంటి వాటిపై పోలీస్ శాఖ నిగా ఉంచిందని ఎస్ఐ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బెట్టింగ్ అనేది ఒక విష సంస్కృతి అని దీనివల్ల జీవితాలు ఆర్థికంగా నష్టపోయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయని, బెట్టింగ్ సంస్కృతికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని, ముఖ్యంగా యువత బెట్టింగ్ మాఫియా మాయలో పడవద్దు అని ఆయన కోరినారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది వ్యసనం అన్నారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ లు, ప్రత్యక్ష బెట్టింగ్ లపై నిఘా ఉంచాము అన్నారు. పౌరులను, యువతను, విద్యార్థులను ఎవరైనా బెట్టింగులకు ప్రోత్సహించిన, బెట్టింగులు పెట్టడానికి ప్రలోభాలకు గురిచేసిన అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల, యువత యొక్క నడవడికపై, ఆర్థిక పరమైన అవసరాలపై గమనిస్తూ ఉండాలని కోరారు. బెట్టింగ్ లకు పాల్పడేవారి, బెట్టింగ్ నిర్వాహకులు, మధ్యవర్తులు ఎవరైనా ఉంటే ఎలాంటి వారి సమాచారం స్థానిక పోలీసు అధికారులకు, డయల్ 100 కు, సూర్యాపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712686026 కు సమాచారం ఇవ్వాలని కోరారు.