బుల్లెట్ రైలు దీక్షకు మద్దతు పలికిన ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘాల నాయకులు 

        బిషప్ దుర్గం ప్రభాకర్ 

Sep 4, 2026 - 22:21
Sep 4, 2026 - 22:22
 0  0
బుల్లెట్ రైలు దీక్షకు మద్దతు పలికిన ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘాల నాయకులు 

సూర్యాపేట, 04 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట పట్టణ కేంద్రం బతుకమ్మ చౌరస్తా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ మరియు రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని, దాని సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘాల నాయకులు ఉత్తమ సామాజిక సేవా అవార్డు గ్రహీత బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ భారతియ రైల్వే శాఖ వారు మొట్టమొదటి గా భారతదేశంలో 1853 లో రైల్వే ప్రవేశపెట్టారనీ 1947 స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలుగా అభివృద్ది చెంది పనిచేస్తున్నాయనీ. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే,శాఖ,ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించిందనీ గుర్తు చేస్తూ  భారత రైల్వే ముఖ్యంగా దూర ప్రయాణాలకు, నగరాలలో పట్టణపు పొలిమేరలవరకు, అవసరమైన రైళ్ళను నడుపుతోందనీ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా ప్రాంతవాసులు రైలు ప్రయాణం నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కు చుట్టూ వున్నా  జిల్లాలు హైదరాబాద్,నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి బోనగిరి, జనగాం, వరంగల్ పట్టనాలకు వెళ్లి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సివస్తుందని అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంనకు రైల్వే మార్గం లేకపోవడం ఇక్కడి రాజకీయ నాయకుల వైపల్యం అనీ అన్నారు. ఈ దీక్ష కు స్వచ్చందంగా పార్టీలకు అతీతంగా అన్నీ వర్గాల ప్రజల యొక్క మద్దతూ రోజు రోజుకు పెరుగుతుందని, మరియు  రైల్వే సాధన సమితి కొరకు జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. సూర్యాపేటకు మొదట చేసిన అలైన్మెంట్ రూట్ మ్యాప్ ప్రకారం బుల్లెట్ రైలు రావాల్సి ఉండగా  కొండమల్లేపల్లి హాలియా సాగర్ మీదుగా మార్చడం అన్యాయం అనీ, దానిని రద్దు చేసి మొదట ప్రకటించిన విధంగా బుల్లెట్ ట్రైన్ ను హైదరాబాద్ చోటుప్పల్, చిట్యాల, నార్కట్ పల్లి, నకిరేకల్ సూర్యాపేటజిల్లా కోదాడ  మీదుగా విజయవాడ చెన్నైకి నడపాలని వారు డిమాండ్ చేశారు.దీని ద్వారా ఈ సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ప్రజలకు విద్యా, వైద్య పరంగా, వ్యాపార వాణిజ్య పరంగా సూర్యాపేట జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాలు  ఎంతో అభివృద్ధి చెందుతాయానీ అన్నాను.ఈ కార్యక్రమంలో సి. హెచ్. శ్యామ్ ప్రసాద్,ముల్లంగి జాకబ్ రాజు, జలగం జేమ్స్, చింత మనిషే, పి. మార్క్, కొండేటి లాజర్, యం. రూబెన్, పంది మార్క్, కొమ్ము హోసన్నా, మామిడి క్రిస్టోఫర్, పిట్టల సామెలు, రెంటాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333