బీఎస్పీ చర్ల మండల అధ్యక్షుడిగా చల్లగుండ్ల సతీష్ చౌదరి నియామకం
4/12/2024 చర్ల మండలం : బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండలం అధ్యక్షులుగా చల్లగుండ్ల సతీష్ చౌదరి నియామకం
చర్ల మండల బహుజన వర్గాల అభివృద్ధి కోసం బీఎస్పీ నిరంతరం కృషి చేస్తుంది
చర్ల మండల బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జిగా సామల ప్రవీణ్ నియామకం
దుమ్ముగూడెం మండలం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జిగా కొప్పుల నారాయణ నియామకం
చర్ల మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం భద్రాచలం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తడికల శివకుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రయోజనం కొరకు సర్వజన హితాయా సర్వజన సుఖాయా అనే నినాదంతో బెహన్ జి కుమారి మాయవతి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న రాజకీయ వేదిక ఇది అని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక పరివర్త ఉద్యమంలో భాగస్వామ్యలు అవ్వాలని అన్నారు అనంతరం చల్లగుండ్ల సతీష్ చౌదరిని పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ నిర్మాణంలో భాగంగా చల్లగుండ్ల సతీష్ చౌదరిని చర్ల మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందనీ అదేవిధంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా మరియు చర్ల మండల పార్టీ ఇన్చార్జిగా సామల ప్రవీణ్ నీ నియమించడం జరిగిందనీ అదేవిధంగా నియోజకవర్గ కోశాధికారిగా మరియు తుమ్ముగూడెం మండలం పార్టీ ఇన్చార్జిగా కొప్పుల నారాయణ ని నియమించడం జరిగిందనీ అన్నారు పార్టీలో నూతనంగా భాద్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు సతీష్ చౌదరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలను ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని కచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం బహుజన ప్రజల వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని తెలిపారు పార్టీలోకి ఆహ్వానించినందుకు బాధ్యతలు అప్పజెప్పినందుకు పై కమిటీ నాయకులకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు