బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Jan 3, 2025 - 20:57
Jan 3, 2025 - 21:01
 0  0
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

సూర్యపేట 04 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్: దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త. మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి  సావిత్రిబాయి పూలే  జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.


 అనంతరం సూర్యాపేట బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ, మండల కమిటీ ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, జిల్లా ఎన్నికల ఇంచార్జ్ నాగురామ్ నామోజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, చల్లా శ్రీలత రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్లు కర్నాటి కిషన్ కనగాల నారాయణ, అంబల్ల నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలిగంటి వీరేంద్ర, మల్లెపాక సాయిబాబా, అక్కిరాజు యశ్వంత్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, సీనియర్ నాయకులు రంగరాజు రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333