బార్ అసోసియేషన్ కు బిజెపి మద్దతు
లేఖను అందజేసను బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి

జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కోర్టు సముదాయ నిర్మాణ స్థలం విషయంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు భారతీ జనతా పార్టీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గురవారం బార్ అసోసియేషన్ అధ్యక్షలు ఆర్ రఘురామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎండి ఖాజా మైనుద్దీన్, ప్రధాన కార్యదర్శి కొండాపూర్ షఫీవుల్లాలకు తమ మద్దతు లేఖను అందజేశారు.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా న్యాయవాదులు చేస్తున్న నిరసనపై పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికె అరుణ తమతో చర్చించారన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల ఉన్న దృష్ట్యా డిల్లీలో ఉన్న డికె అరుణ న్యాయవాదులతో సమావేశం కాలేకపోతున్నా రన్నారు.
గద్వాల న్యాయవాదలు చేస్తున్న నిరసన సమంజసమైనదిగా తమ పార్టీ భావిస్తున్నదన్నారు. అదే సమయంలో న్యాయవాదులు, కక్షిదారుల రక్షణ మరియు ప్రజల అవసరాలన కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిరసనకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ పని సాధనకు గద్వాల బార్ అసోసియేషన్ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎగ్బోటే, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చాకలి నరసింహులు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు దేవదాస్, ఐటి సెల్ జిల్లా కన్వీనర్ చిత్తారి కిరణ్, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి తరుణ్, ఒబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ అనిల్, బీజేపీ నేతలు డిల్లీ వాల కృష్ణ, సాయి, శ్యామ్ సుందర్,పాండు, లడ్డు రాజు, నిజాంకారి మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.