బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. లక్ష్మినారాయణ
జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాలజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా వి. లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ బి.యం. సంతోష్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇంతకుముందు జిహెచ్ఎంసి, హైదరాబాదులో ల్యాండ్ అక్విజేషన్ విభాగంలో పనిచేసి జిల్లాకు అదనపు కలెక్టర్ గా బదిలీపై వచ్చారు. ప్రస్తుతం అదనపు కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాసరావు యధావిధిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజేషన్ గా బాధ్యతలు నిర్వహిస్తారు.
కలెక్టరేట్ ఏ.ఓ. వీరభద్రప్ప కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ, శుభాకాంక్షలు తెలియజేశారు.