నీట్ పరీక్షను మరియు ఎన్టీఏ ను వెంటనే రద్దు చెయ్యాలి

Jul 1, 2024 - 19:04
 0  5
నీట్ పరీక్షను మరియు ఎన్టీఏ ను వెంటనే రద్దు చెయ్యాలి
నీట్ పరీక్షను మరియు ఎన్టీఏ ను వెంటనే రద్దు చెయ్యాలి

          —-వెంకట్
   NSUI జిల్లా అధ్యక్షులు.

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారి ఆదేశానుసారం జోగులాంబ గద్వాల్  జిల్లా NSUI అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని,NTA ను రద్దు చేయాలని నిరసిస్తూ , ఐజ పట్టణం కొత్త బస్టాండ్ చౌరస్తా లో విద్యార్థులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నీట్ పరీక్ష సమస్యపై దేశ ప్రధాని నరేంద్రమోడీ నిర్లక్ష్యపు వైఖరిని, నీట్ విద్యార్థుల సమస్యలపై  బీజేపీ నేతలకు విద్యార్థుల భవిష్యత్తు పై చిత్తశుద్ధి లేని కేంద్ర ప్రభుత్వం నశించాలని వారు అన్నారు. గత పది సంవత్సరాలుగా బీజేపీ హయాంలోనే టెస్టింగ్ ఏజెన్సీ లు పరీక్ష నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందారని, వాటి మూలంగానే విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నఅర్ధకం లో పడ్డాయన్నారు. నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పుతూ మరల పరీక్షను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు•

కార్యక్రమంలో NSUI అలంపూర్ అధ్యక్షులు ప్రకాష్ యోనా,చారి,నవాజ్NSUI వడ్డేపల్లిఅధ్యక్షులు ,సూర్య చంద్ర యూత్ కాంగ్రెస్ ఐజా అధ్యక్షులు ,నరేష్ వైస్ ప్రసిడెంట్ ,విజయ్,రహీమ్ ,రమేష్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333