బయో మైనింగ్‌ ద్వారా చెత్త నియంత్రణ - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Sep 26, 2024 - 18:29
Sep 26, 2024 - 18:30
 0  1
 బయో మైనింగ్‌ ద్వారా చెత్త నియంత్రణ - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
 బయో మైనింగ్‌ ద్వారా చెత్త నియంత్రణ - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
 బయో మైనింగ్‌ ద్వారా చెత్త నియంత్రణ - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

గురువారం మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డ్ లు ప్రక్షాళన కోసం బయో మైనింగ్ విధానం పై  ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లోని డంపింగ్ యార్డ్లలో బయో మైనింగ్‌ విధానంలో చెత్త ను శుద్ధి చేసేందుకు వీలుగా అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బయో మైనింగ్ విధానం ద్వారా డంపింగ్ యార్డ్ లో భారీగా పేరుకుపోయిన చెత్తను మిషన్ల ద్వారా శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ పరిమాణంలో ఉన్న వ్యర్ధాలు అంటే ప్లాస్టిక్ బాటిళ్లు, కొబ్బరి బోండాలు, రాళ్లు, బట్టలు వంటివి, ప్లాస్టిక్ మెటీరియల్ లోను రీసైక్లింగ్ చేయగలిగినవి, రీసైక్లింగ్ చెయ్యలేనివి వివిధ దశలలో బయటకు వస్తాయన్నారు. గ్లాస్ ను కూడా ఫెర్నెస్ లో వేసి రీసైకిల్ చేసి, అన్ని వేరు వేరు చేయగా వచ్చిన మెటీరియల్ ను వర్మీ కంపోస్ట్ గా మార్చగలిగే మ్యాన్యుర్ ను పార్కుల్లో మొక్కలకు, డివైడర్ లో మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, మిగిలిన రాళ్లను లో లెవెల్ ఏరియాను కప్పి పెట్టడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిలింగ్ చేసే కంపెనీలకు అమ్మడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో బయోమైనింగ్ ప్లాంటును ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్తశుద్ధి అనంతరం డంపింగ్ యార్డ్ లోని కాళీ ప్రదేశాలలో సుబాబులు, జామాయిల్  సాగు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లోని నాలుగు మున్సిపాలిటీలలో ఆదాయ వనరులుగా  బాంబో  మొక్కలు మరియు బాదం మొక్కలు సాగు చేయడం  ద్వారా ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ అధికారులకు సూచించారు.

 ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీవోలు దామోదర్ రావు, మధు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా కాలుష్య నివారణ అధికారి రవీందర్ మరియు నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333