బదిలీ పై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేశాడు..
ఒకేరోజు 10 కాదు 20 కాదు ఏకంగా 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు..
ఒకేరోజు ఇన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవ్వడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు..
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లను, రికార్డ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీలు చేస్తున్న క్రమంలో కార్యాలయంలో ఉన్న ఓ అధికారి కిటికీలోంచి రూ.96 వేల నగదు ను బయటికి విసిరి వేయడం కలకలం సృష్టించింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులను, అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది.
ఏసీబీ అదుపులో ఉన్న అధికారులిద్దరు ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రార్ చేసినట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు..
ఈ తనిఖీలు జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి వొచ్చిన ఏసీబీ అధికారుల బృందం చేసినట్టు సమాచారం..