బంగాళాఖాతంలో భారీ తుపాన్.. తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు

Weather Update: నైరుతీ రుతుపవనాలు జోరుమీదున్నాయి. నైరుతీ రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇప్పుడు నైరుతీ రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాతాలకు రానున్నాయి. అలాగే శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాకాతంలోకి కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండటంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలై...5.8కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే మరో ఆవర్తనం..మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. దీని వల్ల సముద్ర మట్టం నుంచి 1.5కిలోమీటర్ల ఎత్తులో మేఘాటు, గాలులు గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడి శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది.
ఇక వచ్చే వారం రోజులపాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి.పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది.గాలి వేగం గంటకు 30 నుంచి 50కిలోమీటర్లు ఉంటుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60కిలోమీటర్లు ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో 19, 20 తేదీల్లో కూడా భయంకర ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ఇక ఇటు తెలంగాణలో రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి. సాయంత్రం4 తర్వాత వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. తర్వాత వర్షం మొదలవుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని 80శాతం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. పశ్చిమ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇలా అర్థరాత్రి వరకు కురవనుంది.భీకర గాలులు కూడా వీస్తాయి.
ఏపీలోనూ రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వాన షురూ అవుతుంది. అది అంతకంతకూ పెరుగుతుంది. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలా రాత్రిమొత్తం కురుస్తూనే ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. ఉత్తరాంధ్ర నేడు సాయంత్రం 4గంటలకు వర్షం మొదలై..భారీ వర్షంగా మారుతుంది. రాత్రి 8గంటల వరకు కురుస్తుంది. కోస్తాంధ్రలో నేడు సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది.