**ఫ్యామిలీ షాపింగ్ కోసం పోలీసు వాహనం"అధికారి తీరుపై సర్వత విమర్శలు*

తెలంగాణ వార్త ప్రతినిధి షాద్ నగర్: *ఫ్యామిలీ షాపింగ్ కోసం పోలీస్ వాహనం*
*అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు*
*పోలీసు వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరుస్తున్న అధికారి*
రోజు నేను ఉద్యోగపరంగా తిరుగుతున్న కదా నా ఫ్యామిలీ తిరిగితే ఏమవుతుందిలే అనుకున్నాడో ఏమో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చౌదర్ గూడ మండల పోలీస్ స్టేషన్ అధికారి యొక్క తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన తన సొంత పనుల కోసం వారి కుటుంబీకుల షాపింగ్ కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి పోలీసు వాహనాన్ని ఉపయోగించడం వెనుక పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి.
TS09PA3473 అనే వాహనాన్ని చౌదరిగూడా పోలీస్ స్టేషన్ కు కేటాయించగా సదరు అధికారి మాత్రం ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వారి కుటుంబ సభ్యుల సొంత ప్రయోజనాల కోసం మరియు షాపింగ్ ల కోసం ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడం నెటిజన్ లలో పెద్ద చర్చగా మారింది. షాద్ నగర్ పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయడానికి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తుల కోసం పోలీసు వాహనాన్ని వాడటమేంటని ప్రభుత్వ అధికారుల తీరుపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గురిపిస్తున్నారు.