ప్రైవేటు పాఠశాలల జులుంపై టీవీ9 కథనంతో
ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ డిఈఓ.
ప్రైవేటు పాఠశాలల జులుంపై టీవీ9 కథనంతో
ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ డిఈఓ.
టై, బూట్లు డ్రెస్సులు పేరుతో చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టాలని ఆదేశం.
ఫీజుల దోపిడీపై నిఘా పెట్టి సగానికి సగం తగ్గించేలా
టీవీ9 మరో కథన ప్రసారం కావాలి.
రాష్ట్రప్రభుత్వమే భాధ్యత వహించాలి..
---- వడ్డేపల్లి మల్లేశం
2024 మే 31 శుక్రవారం రోజున టీవీ9 లో ప్రసారమైనటువంటి హైదరాబాదులోని ప్రైవేట్ పాఠశాలల బాగోతంపై హైదరాబాద్ డి ఇ వో ఆదేశాలు జారీ చేయడం పైన తల్లిదండ్రులు, పౌర సమాజం, అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సీరియస్గా స్పందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. గత ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాదులో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యొక్క స్థితిగతులతో పాటు ఫీజులను తగ్గించే క్రమంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుపతిరావు కమిషన్ తల్లిదండ్రుల పక్షాన అల్పాదా య వర్గాల రక్షణ కోసం సిఫారసు చేయవలసినది పోయి ప్రతి ఏటా10 శాతం అదనంగా ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు చేసిన తీరు సిగ్గుచేటు .ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఏనాడు కూడా విద్యారంగం పైన కృషి చేయలేదు, ప్రైవేటు పాఠశాలల పైన నిఘా పెట్టలేదు.
కేవలం మంత్రివర్గ ఉపసంఘాన్ని వే సినప్పటికీ అది నవమాత్రంగానే మిగిలిపోవడం విచారకరం దానితో బిఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యారంగం పైన శ్రద్ధ లేదని తేలిపోయినది. కానీ లక్షలాది పేద కుటుంబాలు మాత్రం ముఖ్యంగా జంట నగరాలలో అప్పులపాలై తమ పిల్లలను చదివించుకోలేక ఫీజులు భరించలేక అర్ధాకలితో బ్రతికినా బ్రతుకుతున్న సందర్భాలను ఇప్పటికీ మనం గమనించవచ్చు .అంతేకాకుండా గత దశాబ్దాలుగా ప్రైవేటు పిల్లలకు యూనిఫామ్, టై ,బెల్ట్, షూస్ ల పేరుతో విచ్చలవిడిగా యాజమాన్యాలు లాభంతో అమ్ముకోవడంతో ఈ వర్గాలు మరింత నష్టపోతున్నారు. అంతేకాకుండా పుస్తకాలు నోటుబుక్కులను కూడా బయటి కంటే అధిక ధరలకు అమ్ముకోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు నిర్బంధంగా తెలిసి మోసపో తూనెవున్నారు.
మీడియా బలమైనది-- దృఢమైనది కూడా:-
" పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు పత్రికొక్కటున్న మిత్రకోటి పత్రిక లేకున్నా ప్రజకురక్ష లేదు" అంటూ పత్రికారంగ నిపుణులు నార్ల వెంకటేశ్వరావు చేసిన సూచన ఆనాడు పట్రికలు బలంగా ఉన్న కాలంలో అయితే నేడు మీడియా టీవీ ఛానల్ , సామాజిక మాధ్యమాలు ప్రధానంగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న విషయాన్ని గమనించవచ్చు. ఈ నేపద్యంలోనే మీడియా గనుక తలుచుకుంటే అనేక సామాజిక రుగ్మతలు అవినీతి అంతరాలు మోసాలు దగా దోపిడీ పెట్టుబడుదారుల యొక్క దుర్మార్గాలను బట్ట బయలు చేయడానికి ఆస్కారం ఉన్నదని అనేక దృష్టాంతాలు మనకు నిత్యం చూస్తూనే ఉన్నాం.
అందులో ప్రధానమైనది హైదరాబాదు నగరంలోని ప్రైవేట్ పాఠశాలల దోపిడీ టై, బూట్లు, డ్రెస్, బెల్టులతో పాటు స్టేషనరీ ని ఇష్టం ఉన్నట్లుగా అధిక రేట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాల పైన ఇటీవల టీవీ9 కథనాన్ని ప్రసారం చేయడం అది పెద్ద ఎత్తున వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగంలో చలనం రావడం అభినందనీయం . ఇలాంటి సందర్భాలు సన్నివేశాలు ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లోను ఇతర ఏ రాష్ట్రంలోనైనా అక్కడ జరుగుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క దుర్మార్గాలను బయట పెట్టడానికి మీడియా ముందుకు రావాల్సిందే. అందుకు అధికార యంత్రాంగం స్పందించవలసిందే. అల్పాదాయ పేద వర్గాలకు రక్షణ కల్పించవలసిందే అని ఈ సందర్భంగా సందర్భంగా పత్రికలు మీడియాకు విజ్ఞప్తి. .
టీవీ9 ప్రసారం చేసిన ప్రైవేటు పాఠశాలల దోపిడీ కథనం పైన స్పందించినటువంటి హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేస్తూ బూట్లు టై,డ్రెస్, బెల్టులు ఇతర ఏ వస్తువులను కూడా పాఠశాల యాజమాన్యాలు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది . అంతేకాదు నోటుబుక్కులు పుస్తకాలను కూడా లాభాపేక్ష లేకుండా పిల్లలకు అందిస్తే అభ్యంతరం లేదని కూడా తేల్చి చెప్పడంతో పాటు ఇలాంటి దోపిడీని అరికట్టడానికి కచ్చితంగా చర్యలు ఉంటాయని అతిక్రమించిన వారికి తీవ్రమైన శిక్ష విధించబడుతుందని హెచ్చరించడం అభినందనీయం. అయితే ఇలాంటి సందర్భాలు సన్నివేశాలు అనేక సార్లు మనకు దృష్టికి వస్తున్నప్పటికీ, ప్రైవేటు పాఠశాల యొక్క మోసాల పైన అనేకసార్లు కథనాలు వెలువడ్డప్పటికీ గత ప్రభుత్వం 1o ఏళ్లలో ఏనాడు సమీక్షించలేదు,
ప్రస్తుత ప్రభుత్వమైన వెంటనే ప్రైవేటు పాఠశాలల పైన దృష్టి సారించి ఫీజుల జలుoను త గ్గించే క్రమంలో భారీగా కోత విధించడంతోపాటు అల్పాదాయ వర్గాల పిల్లలు విద్యకు దూరం కాకుండా ఉండడానికి ప్రభుత్వమే బాధ్యత వహించి భరోసా ఇవ్వవలసినటువంటి అవసరముంది. లేకుంటే పేద వర్గాల దృష్టిలో ప్రభుత్వం లేనట్టే భావిస్తారు ఎందుకంటే ఆ వర్గాలు విద్య వైద్యం వల్లనే తమ ఆదాయంలో 70% నష్టపోతున్నారు కనుక కొనుగోలు శక్తి తగ్గి పేదరికంలోకి నెట్టబడుతున్నటువంటి వర్గాలకు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించినప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.మీడియా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
టీవీ9, ఇతర ఛానళ్ళు, పత్రికలకు విజ్ఞప్తి :-
కథనాలు ప్రసారం చేయడం అధికార యంత్రాంగంలో చలనం తీసుకురావడం వంటివి మీడియా ద్వారా సాధ్యమవుతున్నటువంటి విషయాలు అంతేకాదు దీనిపైన ప్రజలు ప్రజాస్వామికవాదులు తల్లిదండ్రులు విద్యార్థులలో కూడా చలనం వచ్చినప్పుడు మాత్రమే, పోరాటాలు లేకుండా ఏ విషయాలను కూడా మనం సాధించలేం అనేది నగ్నసత్యం .అయినప్పటికీ టీవీ9 ఎంతో శ్రద్ధతో సామాజిక బాధ్యతతో నిర్వహించినటువంటి ఒక సర్వే ప్రసారం ఆ ప్రసారానికి స్పందన భవిష్యత్తులో మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టవచ్చునని పేద మధ్యతరగతి వర్గాల్లో ఆశను రేకెత్తిస్తున్నది. ఈ సందర్భంగా జంట నగరాలలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత 10 ఏళ్లకు పైగా ఇష్టారాజ్యంగా ఏటా ఏటా ఫీజులను పెంచుకుంటూ నే పోతున్నవి కానీ దానిపైన ప్రభుత్వ నిఘా లేదు తల్లిదండ్రుల యొక్క అభ్యంతరాలను పట్టించుకున్నది లేదు.
కనుక ఈ అంశం పైన టీవీ9 మిగతా మీడియా మిత్రులతో కలిసి ఒక బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని సర్వే చేసి రాజ్యాంగబద్ధంగా ఉచితంగా నాణ్యమైన విద్య అందించవలసినది పోయి 2009 విద్యాహక్కు చట్టం ప్రకారంగా ప్రజలందరికీ ఎనిమిదవ తరగతి వరకు ఉచితంగా విద్య అందించాలని చట్టాలు చెబుతుంటే దానికి భిన్నంగా ఇస్టా రాజ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులను వసూలు చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఒక సర్వే చేపట్టవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తల్లిదండ్రులు విద్యావంతులు ఆలోచన పనులు కోరుతున్నారు. పెట్టుబడుదారి వర్గాన్ని పాలకులు ఇటు పేద వర్గాలు పెంచి పోషిస్తుంటే మరి పేదలను రక్షించేది ఈ దేశంలో ఎవరు ?అనే సందేహం రాక మానదు .కావున పేద వర్గాలను పట్టిపీడిస్తున్నటువంటి పెట్టుబడిదారీ సమాజాన్ని దోషిగా నిలబెట్టే క్రమంలోపల సమగ్రమైనటువంటి సర్వే జరిపించి ప్రస్తుతం ఉన్న ఫీజులను సగానికి సగం భారీగా తగ్గించే విధంగా ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రావడానికి మీడియా కృషి చేయాలని విజ్ఞప్తి చేద్దాం .
ఒక అవినీతి, అన్యాయం, దాపరికం, రహస్యంగా ఉన్నంతవరకు రాజ్యమేలుతుంది కానీ 10 మంది దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ప్రభుత్వం కానీ పెట్టుబడిదారులు గాని ప్రజలు గానీ తల్లిదండ్రులు గాని ఆలోచించక మానరు. ఆ క్రమంలో ఒక బలమైనటువంటి సరైన నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రభుత్వపరంగా జరగాలని పెట్టుబడుదారి ప్రైవేటు పాఠశాలలు కూడా స్వచ్ఛందంగా తమ ఫీజులను సగానికి సగం తగ్గించుకోవాలని ఆశిద్దాం. ఆ వైపుగా ప్రభుత్వంలో కదలిక రావాలంటే టీవీ9 తో పాటు మిగతా మీడియా మిత్రుల యొక్క ప్రసారాలు నిరంతరం కొనసాగాలని ఇలాంటి దుశ్చర్యల పట్ల ఉక్కు పాదం మోపాలని సమాజ పరంగా మనమంతా మనసారా కోరుకుందాం. .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ )